Passenger Trains Cancelled Till September 30: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ సర్వీసుల రద్దును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రస్తుతం నడుస్తున్న 230 స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుస్తాయని ప్రకటించింది. కరోనా నేపధ్యంలో ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. కాగా, గతంలో ప్యాసింజర్ రైళ్లపై విధించిన రద్దు ఆగష్టు 12తో ముగుస్తున్న సంగతి విదితమే.
Also Read:
ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..