2023 వన్డే ప్రపంచకప్ ఖచ్చితంగా ఆడతాః శ్రీశాంత్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం ఈ సెప్టెంబర్‌లో పూర్తి కానుండగా.. కేరళ క్రికెట్ అసోషియేషన్(KCA)నుంచి అవకాశం లభించింది. కేరళ రంజీ జట్టులో శ్రీశాంత్‌ను తీసుకోవాలని కేసీఏ సిద్ధపడింది. అయితే ఆ లోపు శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కేసీఏ సెక్రటరీ మాట్లాడుతూ సుశాంత్ పునరాగమనంతో తమ జట్టు బలపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా ఒక […]

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం ఈ సెప్టెంబర్‌లో పూర్తి కానుండగా.. కేరళ క్రికెట్ అసోషియేషన్(KCA)నుంచి అవకాశం లభించింది. కేరళ రంజీ జట్టులో శ్రీశాంత్‌ను తీసుకోవాలని కేసీఏ సిద్ధపడింది. అయితే ఆ లోపు శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కేసీఏ సెక్రటరీ మాట్లాడుతూ సుశాంత్ పునరాగమనంతో తమ జట్టు బలపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. శ్రీశాంత్ 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీశాంత్.. 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆడగలని ధీమా వ్యక్తం చేశాడు. తన లక్ష్యాలు ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయని శ్రీశాంత్ తాజాగా వ్యాఖ్యానించాడు.




