పాకిస్తాన్ దుశ్చర్య.. భారత భూభాగాల ఆక్రమణ… ఖండించిన ఢిల్లీ

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 3:18 PM

జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత భూభాగాలలో మార్పులు చేయడానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా ఖండించింది. అక్కడి గిల్గిట్-బల్టిస్తాన్ (బెలూచిస్తాన్) తమ దేశ భూభాగంలోనివేనని పాక్ సుప్రీంకోర్టు ఇఛ్చిన ఉతర్వులపట్ల నిరసన తెలుపుతూ.. గిల్గిట్, బల్టిస్తాన్ సహా జమ్మూ కాశ్మీర్ లడఖ్ యూనియన్ టెరిటరీలన్నీ మా దేశ అంతర్భాగంలోనివేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ దౌత్యాధికారికి ఓ నోట్ పంపింది.. అక్రమంగా, బలవంతంగా మా భూభాగాలను స్వాధీనం […]

పాకిస్తాన్ దుశ్చర్య.. భారత  భూభాగాల ఆక్రమణ... ఖండించిన ఢిల్లీ
Follow us on

జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత భూభాగాలలో మార్పులు చేయడానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా ఖండించింది. అక్కడి గిల్గిట్-బల్టిస్తాన్ (బెలూచిస్తాన్) తమ దేశ భూభాగంలోనివేనని పాక్ సుప్రీంకోర్టు ఇఛ్చిన ఉతర్వులపట్ల నిరసన తెలుపుతూ.. గిల్గిట్, బల్టిస్తాన్ సహా జమ్మూ కాశ్మీర్ లడఖ్ యూనియన్ టెరిటరీలన్నీ మా దేశ అంతర్భాగంలోనివేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ దౌత్యాధికారికి ఓ నోట్ పంపింది.. అక్రమంగా, బలవంతంగా మా భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి పాక్ ప్రభుత్వానికి గానీ, ఆ సుప్రీంకోర్టుకు గానీ హక్కు లేదని పేర్కొంది. మీరు చేస్తున్న పనులు దాచినా దాగవు.. సుమారు ఏడు దశాబ్దాలుగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నవారి స్వేచ్చను హరించే యత్నాలను మేం సహించం.. అని ఈ నోట్ లో అన్నారు. గిల్గిట్.. బల్జిస్తాన్  లలో సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించాలని, ఓ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  పాక్ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.