మా దేశ మ్యాప్ లో తప్పుల తడకలు చూపుతున్నారు, తొలగించండి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇండియా అభ్యర్థన

| Edited By: Anil kumar poka

Jan 14, 2021 | 9:05 PM

భారతీయ మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను వేర్వేరుగా చూపుతున్నారని  భారత్ ....ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

మా దేశ మ్యాప్ లో తప్పుల తడకలు చూపుతున్నారు, తొలగించండి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇండియా అభ్యర్థన
Follow us on

భారతీయ మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను వేర్వేరుగా చూపుతున్నారని  భారత్ ….ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జెనీవాలో భారత దౌత్య ప్రతినిధి ఇంద్రమణి పాండే ఈ విషయాన్ని ఈ సంస్థ దృష్టికి తెచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెందిన వివిధ వెబ్ పోర్టల్స్ లో భారత దేశ సరిహద్దులను తప్పుల తడకగా చూపుతున్నారని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఈ తప్పులను సరిదిద్దాలని కోరారు. కేవలం నెల రోజుల్లో ఇండియా ఈ అంశాన్ని ఈ సంస్థ దృష్టికి తేవడం ఇది మూడోసారి. లోగడ ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ కి  లేఖ పూర్వకంగా తెలియజేసినా ఫలితం లేకపోవడంతో ఇక భారత రాయబారే నేరుగా రంగంలోకి దిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఆయా దేశాల సరిహద్దులకు సంబంధించి జియో-పాలిటిక్స్ ను నిర్దేశిస్తుందని, ఆ నియమావళి మేరకు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పాండే అన్నారు. ఇటీవలే పాకిస్థాన్..జమ్మూ కాశ్మీర్, లడఖ్ సహా కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంది. ఈ వివాదాన్ని కూడా పాండే పేర్కొన్నారు.

కాగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని, భారత మ్యాప్ లోని లొసుగులను సరిదిద్దుతామని టెడ్రోస్ హామీ ఇచ్చ్చారు.