AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా దేశ మ్యాప్ లో తప్పుల తడకలు చూపుతున్నారు, తొలగించండి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇండియా అభ్యర్థన

భారతీయ మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను వేర్వేరుగా చూపుతున్నారని  భారత్ ....ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

మా దేశ మ్యాప్ లో తప్పుల తడకలు చూపుతున్నారు, తొలగించండి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇండియా అభ్యర్థన
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 14, 2021 | 9:05 PM

Share

భారతీయ మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను వేర్వేరుగా చూపుతున్నారని  భారత్ ….ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. జెనీవాలో భారత దౌత్య ప్రతినిధి ఇంద్రమణి పాండే ఈ విషయాన్ని ఈ సంస్థ దృష్టికి తెచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు చెందిన వివిధ వెబ్ పోర్టల్స్ లో భారత దేశ సరిహద్దులను తప్పుల తడకగా చూపుతున్నారని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఈ తప్పులను సరిదిద్దాలని కోరారు. కేవలం నెల రోజుల్లో ఇండియా ఈ అంశాన్ని ఈ సంస్థ దృష్టికి తేవడం ఇది మూడోసారి. లోగడ ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ కి  లేఖ పూర్వకంగా తెలియజేసినా ఫలితం లేకపోవడంతో ఇక భారత రాయబారే నేరుగా రంగంలోకి దిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి ఆయా దేశాల సరిహద్దులకు సంబంధించి జియో-పాలిటిక్స్ ను నిర్దేశిస్తుందని, ఆ నియమావళి మేరకు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పాండే అన్నారు. ఇటీవలే పాకిస్థాన్..జమ్మూ కాశ్మీర్, లడఖ్ సహా కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంది. ఈ వివాదాన్ని కూడా పాండే పేర్కొన్నారు.

కాగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని, భారత మ్యాప్ లోని లొసుగులను సరిదిద్దుతామని టెడ్రోస్ హామీ ఇచ్చ్చారు.

Follow Us
విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఈ ట్రిక్స్‌తో భారీగా తగ్గింపు!
విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఈ ట్రిక్స్‌తో భారీగా తగ్గింపు!
ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక..
ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక..
తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
తెలంగాణ ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన
పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!
అర్జిత్.. నువ్వు ఇలా చేయొద్దు.. మేమేమైపోతాము చెప్పు..
అర్జిత్.. నువ్వు ఇలా చేయొద్దు.. మేమేమైపోతాము చెప్పు..
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో కీలక మార్పులు
సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో కీలక మార్పులు
మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్!
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికేశాడు
NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికేశాడు
శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు
శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు