టీవీ9 వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు

|

Oct 25, 2020 | 7:30 AM

దసరా.. విజయానికి ప్రతీక. అందుకే ఈ పర్వదినాన్ని విజయదశమి అని కూడా అంటారు. దసరా అనగానే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. నిలువెల్లా భక్తిపారవశ్యం ఆవహిస్తుంది. హిందువుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన విజయదశమిని ఇవాళ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల తరువాత రోజు వచ్చే శుద్ధ దశమిని ‘విజయ దశమి’, అంటారు. ఏ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు తగినట్లు నిర్వహించుకుంటారు. అలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా దసరా వేడుకలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా […]

టీవీ9 వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు
Follow us on

దసరా.. విజయానికి ప్రతీక. అందుకే ఈ పర్వదినాన్ని విజయదశమి అని కూడా అంటారు. దసరా అనగానే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. నిలువెల్లా భక్తిపారవశ్యం ఆవహిస్తుంది. హిందువుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన విజయదశమిని ఇవాళ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల తరువాత రోజు వచ్చే శుద్ధ దశమిని ‘విజయ దశమి’, అంటారు. ఏ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు తగినట్లు నిర్వహించుకుంటారు. అలా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా దసరా వేడుకలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా విజయదశమి వేడుకలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. దసరా పర్వదినం అంటే ఒక్కరోజు వేడుక కాదు. పదిరోజుల పండుగ ఇది. ప్రతిఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులుగా భారతీయులు కొలుస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకోవడం అనాది నుంచి సంప్రదాయంగా వస్తోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని టీవీ9 వీక్షకులకు వెబ్ సైట్ టీం శుభాకాంక్షలు చెబుతోంది.