యాపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మార్కెట్‌లోకి భారత్ ఐఫోన్లు..

భారత్‌లో ప్రతిష్టాత్మకంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రారంభించిన ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ నుంచి తయారైన ఐఫోన్లు వచ్చేనెలలో మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు సమాచారం. భారత్‌లోనే తయారుకావడంతో ఈ ఐఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వాటికి అనుమతులు రావాల్సి ఉందని.. భారత్‌లో తయారైన ఐఫోన్-ఎక్స్ ఆర్, ఐఫోన్- ఎక్స్ ఎస్ వచ్చేనెల మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం పై యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫాక్స్‌కాన్ కూడా తమ […]

యాపిల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మార్కెట్‌లోకి భారత్ ఐఫోన్లు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:35 PM

భారత్‌లో ప్రతిష్టాత్మకంగా ఫాక్స్‌కాన్ సంస్థ ప్రారంభించిన ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ నుంచి తయారైన ఐఫోన్లు వచ్చేనెలలో మార్కెట్‌లోకి విడుదల కానున్నట్లు సమాచారం. భారత్‌లోనే తయారుకావడంతో ఈ ఐఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వాటికి అనుమతులు రావాల్సి ఉందని.. భారత్‌లో తయారైన ఐఫోన్-ఎక్స్ ఆర్, ఐఫోన్- ఎక్స్ ఎస్ వచ్చేనెల మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం పై యాపిల్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫాక్స్‌కాన్ కూడా తమ ఉత్పత్తులపై స్పందించేందుకు నిరాకరించింది. భారత్‌లో స్థానికంగా తయారయ్యాయి కాబట్టి వీటిపై అధిక స్థాయిలో పన్నులు ఇతర ట్యాక్సులు ఉండవు. యాపిల్ ఐఫోన్లను కొన్ని లక్షల మంది భారతీయులు వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చైనా సంస్థ వన్ ప్లస్ నుంచి అధిక పోటీని ఎదుర్కొంటోంది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో స్మార్ట్ ఫోన్ తయారీకి కేంద్రంగా తయారు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది.

చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా యాపిల్ సంస్థ భారత్‌లో తమ సంస్థలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అమెరికా, చైనా మధ్య పరిస్థితుల కారణంగా ఐఫోన్ల సేల్స్‌ను కూడా ఆ సంస్థ తగ్గించింది. ఇక భారత్‌లో తయారైన ఐఫోన్ 6 ఎస్ 7 మోడల్స్‌ను యూరప్, హాంకాంగ్‌లకు ఎగుమతి చేస్తోంది.