బంగ్లాదేశ్‌తో భార‌త్ చ‌ర్చ‌లు, ఎందుకంటే !

|

Aug 17, 2020 | 5:03 PM

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై భార‌త ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, వాయి ర‌వాణా గురించి భారతదేశం, బంగ్లాదేశ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

బంగ్లాదేశ్‌తో భార‌త్ చ‌ర్చ‌లు, ఎందుకంటే !
Follow us on

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై భార‌త ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, వాయి ర‌వాణా గురించి భారతదేశం, బంగ్లాదేశ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. రెండు దేశాల మధ్య తాత్కాలిక ఏర్పాట్లు ద్వారా వాణిజ్య విమానాల సేవలను పునః ప్రారంభించే లక్ష్యంతో ఈ చ‌ర్చ‌లు సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వారం ప్రారంభంలో భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వి. శ్రీంగ్లా ఇండియాలోని బంగ్లాదేశ్ హై క‌మిష‌న‌ర్ మహ్మ‌ద్ ఇమ్రాన్‌తో చ‌ర్చించారు.

దౌత్య వర్గాల సమాచారం ప్రకారం, సరిహద్దు ప్ర‌యాణాల‌పై ఉన్న అన్ని ఆంక్షలను బంగ్లాదేశ్ తొలగించ‌డంతో, అక్క‌డికి‌ ప్రజల రాక‌పోక‌లు జరుగుతున్నాయి. ఇండియాలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆంక్ష‌లు కొన‌సాగిస్తూనే ఉంది. వైద్యం కోసం ఇండియాకు వచ్చేవారి ప్రవేశానికి అనుమతించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. ఢాకాలోని భారత హైకమిషన్ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు విమాన రాక‌పోక‌లు నిలిచిపోవడంతో ఇక్క‌డికి రాలేక‌పోతున్నారు.

Also Read :

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు

కరోనా కొత్త జన్యువు గుర్తించిన మలేసియా : పది రేట్లు వేగంగా వైరస్‌ వ్యాప్తి