
India Lockdown: దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్త అందించింది. ఎల్పీజీ సిలెండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలెండర్(14 కేజీల) సిలెండర్ ధరపై రూ. 65 మేరకు అన్ని మెట్రో నగరాల్లోనూ తగ్గించింది. ఇక ఈ తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో ఎల్పీజీ సిలెండర్ ధరపై రూ. 61.5, రూ. 65, రూ. 62, రూ. 64.5 మేరకు తగ్గినట్లు తెలుస్తోంది. దీనితో ఢిల్లీలో 744/- , కోల్‌కత్తాలో 774.5/, ముంబయిలో 714.5/-, చెన్నైలో 761.5/-గా ధరలు ఇవాళ నుంచి అమలవుతాయి. కాగా, కమర్షియల్ సిలెండర్ రేట్లు యధాతధంగా ఉండనున్నాయి.
ఇవి చదవండి:
చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..
చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!
ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..