పాక్ గూఢచర్యం.. హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది కోత

| Edited By: Pardhasaradhi Peri

Jun 23, 2020 | 7:32 PM

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని హోం శాఖ నిర్ణయించింది. ఈ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు ఆ మధ్య మన దేశ సైనిక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ కి చేరవేసి గూఢచార కార్యకలాపాలకు పాల్పడిన విషయం గమనార్హం. దీంతో ప్రభుత్వం..

పాక్ గూఢచర్యం.. హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది కోత
Follow us on

ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని హోం శాఖ నిర్ణయించింది. ఈ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు ఆ మధ్య మన దేశ సైనిక సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ కి చేరవేసి గూఢచార కార్యకలాపాలకు పాల్పడిన విషయం గమనార్హం. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో కూడా సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నారు. ఢిల్లీలో గల పాక్ హైకమిషన్ ఆఫీసులో కొంతమంది ఉద్యోగుల నిర్వాకం గురించి పాక్ దౌత్యాధికారి తెలియజేసినట్టు హోమ్ శాఖ వర్గాలు తెలిపాయి. గత మే 31 న ఇక్కడి ఇద్దరు ఉద్యోగులు రహస్యంగా తమ దేశానికి భారత సైనిక సమాచారాన్ని చేరవేస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కాగా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు డ్రైవర్లపై  కొందరు పాకిస్థానీలు దాడులు జరిపి వారిని చిత్రహింసలు పెట్టారు. వారు ఈ నెల 22న ఢిల్లీకి తిరిగి వఛ్చి.. తమను ఎలా టార్చర్ పెట్టారో అధికారులకు వివరించారు. పైగా అక్కడి మన హైకమిషన్ కార్యాలయంలో ఇతర అధికారులను వేధిస్తున్నారని కూడా వారు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.