జకోవిచ్‌కు కరోనా పాజిటివ్
టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా జొకోవిచ్ ప్రకటించారు. జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలీనాకు పాజిటివ్ రాగా వారి పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది...

Novak Djokovic and wife Jelena test corona positive : టెన్నిస్ వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా జొకోవిచ్ ప్రకటించారు. జోకోవిచ్‌తో పాటు అతని భార్య జెలీనాకు పాజిటివ్ రాగా వారి పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ విషయంపై జోకోవిచ్ మాట్లాడుతూ..’ నేను బెల్‌గ్రేడ్‌కు చేరుకున్న తర్వాత నా భార్య పిల్లలతో కలిసి కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. రిపోర్టులో నాకు, నా భార్యకు పాజిటివ్ రాగా, పిల్లలకు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఈ 14 రోజులు నా భార్యతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణియించుకున్నాం. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటాం.’ అని ప్రకటిన విడుదల చేశారు.




