విద్యార్థులు లేకుండానే ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలు

|

Jul 14, 2020 | 6:31 PM

చరిత్రలో తొలిసారి భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సాదాసీదాగా నిర్వహించేందుకు కేంద్రం ఫ్లాన్ చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలవుతున్న నిబంధనల కారణంగా నిరాడంబరంగా విద్యార్థినీ, విద్యార్థులు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులు లేకుండానే ఎర్రకోట స్వాతంత్ర్య వేడుకలు
Follow us on

చరిత్రలో తొలిసారి భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సాదాసీదాగా నిర్వహించేందుకు కేంద్రం ఫ్లాన్ చేస్తోంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అమలవుతున్న నిబంధనల కారణంగా నిరాడంబరంగా విద్యార్థినీ, విద్యార్థులు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో మాదిరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కాకుండా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే కార్యక్రమానికి గతంలో కంటే ఈ ఏడాది కేవలం 20 శాతం మంది వీవీఐపీలు, ప్రేక్షకులు మాత్రమే అనుమతినివ్వనున్నట్లు సమాచారం. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్.. ఎర్ర కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవాల సన్నాహాలను పరిశీలించారు. కరోనా దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో ఈసారి విద్యార్థినీ, విద్యార్థులు పాలుపంచుకోబోరని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేషనల్ కేడెట్ కార్ప్స్ కేడెట్లు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ వేడుకలకు కేవలం 100 మంది ప్రముఖులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న 1,500 మంది ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. వీరిలో 500 మంది స్థానిక పోలీసు సిబ్బంది కాగా, మిగిలినవారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉండబోతున్నట్లు సమాచారం.