శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్న అమిత్‌ షా.. ఏర్పాట్లు షురూ..

ఆర్టికల్ 370 రద్దు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక పై అన్ని ప్రాంతాల్లో లాగే జమ్ముకశ్మీర్ లో కూడా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటికే బీజేపీ ఫ్లాన్ చేసింది. అయితే కశ్మీర్‌లో మోదీ జెండా ఎగురవేయాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలను మోదీ సర్కార్ ఖండించింది. శ్రీనగర్‌లో మోదీ […]

శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్న అమిత్‌ షా.. ఏర్పాట్లు షురూ..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2019 | 2:39 PM

ఆర్టికల్ 370 రద్దు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక పై అన్ని ప్రాంతాల్లో లాగే జమ్ముకశ్మీర్ లో కూడా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటికే బీజేపీ ఫ్లాన్ చేసింది. అయితే కశ్మీర్‌లో మోదీ జెండా ఎగురవేయాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలను మోదీ సర్కార్ ఖండించింది. శ్రీనగర్‌లో మోదీ జాతీయజెండా ఎగురవేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. అయితే కేంద్రం నుంచి హోంమంత్రి అమిత్ షా వెళ్లబోతున్నట్లు సమాచారం. అమిత్ షా యే స్వయంగా లక్నోలోని లాల్ చౌక్ వద్ద జెండా ఎగురవేస్తారని కేంద్రం ప్రకటించింది.