AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అలా ఎలా కొట్టావ్ రా సామి.. కేఎల్ రాహుల్ సిక్స్‌కు గంభీర్ రియాక్షన్ చూడండి!

ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో పాటు, బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అదరగొట్టారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ భారీ సిక్స్‌కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశ్చర్యపోయిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Video: అలా ఎలా కొట్టావ్ రా సామి.. కేఎల్ రాహుల్ సిక్స్‌కు గంభీర్ రియాక్షన్ చూడండి!
Kl Rahul's Six
SN Pasha
|

Updated on: Jun 14, 2026 | 10:14 AM

Share

శనివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ 25 ఓవర్లకే కుదించినా.. ఫ్యాన్స్‌కు మాత్రం కావాల్సినంత వినోదం అయితే లభించింది. శుబ్‌మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, అంతకుముందు బౌలర్లు అదరగొట్టారు. మొత్తంగా టీమిండియా ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొట్టిన భారీ సిక్స్‌కు ప్రేక్షకులే కాదు.. ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం షాక్ అయ్యాడు.

భలే కొట్టాడు కదా.. అంటూ కళ్లు ఎగరేశాడు. రాహుల్ సిక్స్‌కు గంభీర్ ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఎప్పుడూ కామ్‌గా, సీరియస్‌గా ఉండే గంభీర్.. ఇలా రాహుల్ అద్భుతమైన సిక్స్‌కు స్పెషల్ రియాక్షన్‌తో స్పందించడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ షాట్ కూడా మామూలుగా లేదు. గంభీర్‌ను ఇంప్రెస్ చేయాలంటే ఇలాంటి అన్‌బిలివబుల్ షాట్లు ఆడాలన్న మాట అంటూ క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

వీడియో చూడండి

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ రహెమనుల్లా గుర్బాజ్ ఒక్కడే సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా టీమిండియా బౌలింగ్ ఎటాక్ ముందు నిలబలేకపోయారు. టీమిండియా బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 3, హర్ష్ దూబే 3 వికెట్లు తీసి డెబ్యూలోనే అదరగొట్టారు. అలాగే అర్షదీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక 195 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 22.5 ఓవర్లలో టార్గెట్‌ను ఊదిపారేసింది. రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు 16 పరుగులకే రనౌట్ అయినా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 84 (నాటౌట్) పరుగులు, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 39(నాటౌట్) రన్స్ చేసి టీమిండియాకు ఈజీ విక్టరీ అందించారు. అలాగే వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ 34 పరుగులు చేసి రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us