Corona Cases in Delhi : కరోనా మహమ్మారితో జనం వణికిపోతున్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కొద్ది రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి మరింత పెరుగుతున్నాయి. ప్రతి రోజు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4,473 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసులతో 2,30,269కి చేరుకుంది. ఇవాళ ఒక్క రోజే 33 మంది వ్యాధి బారిన పడి మృతి చెందగా ఇప్పటివరకు 4,839 మంది మరణించారు. ప్రస్తుతం 30,914 యాక్టీవ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,94,516 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.