తిరుపతి ఎంపీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులు అని..

తిరుపతి ఎంపీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2020 | 9:30 PM

PM Modi tweet : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్‌ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారంటూ తన ట్విట్టర్ ఖాతాలో నివాళులు అర్పిస్తూ పోస్టు చేశారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.  కాగా ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయనకు బుధవారం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.