బీజేపీ-ఫేస్ బుక్ ‘రిలేషన్ షిప్ బయటపడింది’. రాహుల్ గాంధీ

బీజేపీ-ఫేస్ బుక్ 'సంబంధాలపై కాంగ్రెస్ పార్టీ మళ్ళ్లీ ధ్వజమెత్తింది. ఈ మేరకు టైమ్ మేగజైన్ లో ప్రచురితమైన ఓ ఆర్టికల్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ..

బీజేపీ-ఫేస్ బుక్ రిలేషన్ షిప్ బయటపడింది. రాహుల్ గాంధీ

Edited By:

Updated on: Aug 29, 2020 | 6:34 PM

బీజేపీ-ఫేస్ బుక్ ‘సంబంధాలపై కాంగ్రెస్ పార్టీ మళ్ళ్లీ ధ్వజమెత్తింది. ఈ మేరకు టైమ్ మేగజైన్ లో ప్రచురితమైన ఓ ఆర్టికల్ ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ.. ఇదే సమయంలో వాట్సాప్-బీజేపీ మధ్య సంబంధాలను కూడా ఇది హైలైట్ చేసిందన్నారు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బెర్గ్ కి ఏకంగా ఓ లేఖనే పార్టీ తిరిగి పంపడం విశేషం. బీజేపీ నేతల ద్వేష పూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలను మీరు పక్కనపెడ్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై దర్యాప్తునకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాలకోసం మా దేశంలోని సామాజిక సామరస్యాన్ని ఓ విదేశీ సంస్థ భంగపరచజాలదన్నారు. తప్పనిసరిగా మళ్ళీ మీకు లేఖ రాయవలసి వస్తోందన్నారు. టైమ్ పత్రికలో వఛ్చిన వ్యాసాన్ని పురస్కరించుకుని దీన్ని పంపుతున్నామని, ఫేస్ బుక్ ఇండియా-పాలక బీజేపీ మధ్య ‘నీకది..నాకిది’ అనే టైపులో వ్యవహారం సాగుతోందని ఆరోపించారు.

వాట్సాప్ పై భారతీయ జనతా పార్టీకి పట్టు ఉంది.. 40 కోట్ల మంది భారతీయులు వినియోగిస్తున్న ఈ సంస్థకు కూడా ఇండియాలో తన పే మెంట్ లైసెన్స్ కోసం మోదీ ప్రభుత్వ క్లియరెన్సులు అవసరమే అని రాహుల్ ట్వీట్ చేశారు. వాట్సాప్ సర్వీసు ఇండియాలో డిజిటల్ పే మెంట్ సర్వీసును నిర్వహిస్తోంది. ఇందుకు దీనికి బీజేపీ అనుమతి ఎంతయినా అవసరం అని ఆయన  పేర్కొన్నారు.