శాకాహారం.. మాంసాహారం అనేది తేడా చూపలేం: జొమాటో

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జొమాటో డెలివరీ బాయ్‌ల ఆందోళన కొనసాగుతున్నా నేపథ్యంలో.. ఆ సంస్థ వివరణ ఇచ్చింది. భారత్ లాంటి దేశాల్లో వెన్, నాన్ వెజ్ ప్రాధామ్యాలుగా ఎంచుకుని డెలివరీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పనిలోకి వచ్చే ముందే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగ స్వభావాన్ని అవగతం చేసుకుంటారని తెలిపింది. డెలివరీ చేయాల్సింది శాకాహారమా.. మాంసాహారమా అన్న విషయంలో తేడా చూపలేమని ఆ సంస్థ తెలిపింది. కాగా, తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే […]

శాకాహారం.. మాంసాహారం అనేది తేడా చూపలేం: జొమాటో
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 12, 2019 | 1:47 PM

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జొమాటో డెలివరీ బాయ్‌ల ఆందోళన కొనసాగుతున్నా నేపథ్యంలో.. ఆ సంస్థ వివరణ ఇచ్చింది. భారత్ లాంటి దేశాల్లో వెన్, నాన్ వెజ్ ప్రాధామ్యాలుగా ఎంచుకుని డెలివరీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పనిలోకి వచ్చే ముందే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగ స్వభావాన్ని అవగతం చేసుకుంటారని తెలిపింది. డెలివరీ చేయాల్సింది శాకాహారమా.. మాంసాహారమా అన్న విషయంలో తేడా చూపలేమని ఆ సంస్థ తెలిపింది. కాగా, తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ హిందూ, ముస్లిం ఫుడ్‌ డెలివరీబాయ్స్‌ సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు. ఇటీవల కొన్ని ముస్లిం రెస్టారెంట్లును ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో యాడ్‌ చేశారని, అయితే వీటి నుంచి బీఫ్‌ను సరఫరా చేసేందుకు కొందరు హిందూ డెలివరీ బాయ్‌లు నిరాకరిస్తున్నారని జొమాటో ఫుడ్‌ డెలివరీ ఉద్యోగి ఒకరు చెప్పుకొచ్చారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో తాము ​పందిమాంసం డెలివరీ చేయాల్సి వస్తోందని ముస్లిం డెలివరీ బాయ్స్‌ వీటిని డెలివరీ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వేతన, చెల్లింపుల సమస్యలపై కూడా తాము అసంతృప్తిగా ఉన్నామని వారు చెబుతున్నారు.