తాగుబోతులు ఈ సీన్ చూస్తే తెగ ఫీలైపోతారు.. గుండె తరుక్కుపోతుంది

తాగుబోతులు ఈ సీన్ చూస్తే తెగ ఫీలైపోతారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన.. మీరూ చూస్తే షాక్ అవుతారు. అసలు ఇంతకీ అక్కడ జరిగింది ఏంటి.? పైన పేర్కొన్న ఫోటోలో కనిపిస్తోన్న పార్శిళ్లు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఆ వివరాలు

తాగుబోతులు ఈ సీన్ చూస్తే తెగ ఫీలైపోతారు.. గుండె తరుక్కుపోతుంది
Liquor
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 21, 2024 | 5:59 PM

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ పిప్లానీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పికప్ వాహనంలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నట్టు ఇన్‌ఫార్మర్‌ సమాచారం ఇవ్వడంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ల నుంచి 130 బాక్సులు అంటే 1530 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ మద్యాన్ని బిల్ఖారియా ప్రాంతం నుంచి పికప్ వాహనంలో భోపాల్‌లోని ఏదో ప్రాంతంలో సరఫరా చేయాల్సి ఉందట. పికప్ వ్యాన్‌లో ఏకంగా భారీ లిక్కర్ పార్శిళ్లు ఉండటాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. మరోవైపు అరెస్టయిన నిందితుడు రాహుల్ గుర్జార్ కాగా, భోపాల్ అవుట్ స్కర్ట్స్‌లో ఈ మద్యాన్ని సరఫరా చేసేందుకు వెళ్తున్నాడని డీసీపీ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఈ మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.? ఎక్కడికి సరఫరా చేస్తున్నారు.? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

మద్యం అక్రమ రవాణాపై నిఘా..

భోపాల్‌లో అక్రమ మద్యం రవాణాపై పోలీసు నిఘా కట్టుదిట్టం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్మగ్లర్లపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. మద్యం అక్రమ రవాణా వల్ల శాంతిభద్రతలు క్షీణించడమే కాకుండా సమాజంలో మాదకద్రవ్యాల వ్యసనాన్ని కూడా పెంచుతుందని, దీనిని అరికట్టేందుకు పోలీసులు అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు.

ఇది చదవండి: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు