కోవిడ్‌-19 లక్షణాలను ముందే పసికట్టే యాప్‌

|

Sep 05, 2020 | 6:26 PM

కరోనా లక్షణాలను ముందుగానే తెలుసుకోవమే! మొదటి రెండు సరే! కరోనా లక్షణాలను కనుక్కోవడమెలా? అంటే అందుకో మార్గం కనిపెట్టాయి మద్రాస్‌ ఐఐటీ, అంకుర సంస్థ మ్యూస్‌ వేరబుల్స్‌..

కోవిడ్‌-19 లక్షణాలను  ముందే పసికట్టే యాప్‌
Follow us on

కరోనా వైరస్‌ను నివారించడానికి వ్యాక్సిన్‌ వస్తే అంతకంటే ఆనందమేముంటుంది..? కాని ఆ వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చేలా లేదు.. మరి మార్గమేమిటి? అంటే కరోనా అంటకుండా జాగ్రత్తలు తీసుకోవడమే! కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించడమే! అంతేకాకుండా కరోనా లక్షణాలను ముందుగానే తెలుసుకోవమే! మొదటి రెండు సరే! కరోనా లక్షణాలను కనుక్కోవడమెలా? అంటే అందుకో మార్గం కనిపెట్టాయి మద్రాస్‌ ఐఐటీ, అంకుర సంస్థ మ్యూస్‌ వేరబుల్స్‌.. మనుషుల్లో కరోనా లక్షణాలను ముందుగానే పసికట్టే స్మార్ట్‌ బ్యాండ్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేశాయా సంస్థలు.. మన టెంపరేచరల్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌ను బట్టి రెండు మూడు రోజుల ముందే కరోనా వైరస్‌ను ఈ స్మార్ట్‌ బ్యాండ్‌ గుర్తిస్తుందట! గుర్తించడమే కాదు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుందట! మ్యూస్‌ క్యూ పేరిట తయారు చేసిన ఈ బ్యాండ్‌ ధర అయిదు వేల రూపాయలు మాత్రమేనట! స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ మ్యూస్‌ హెల్త్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలట! మన బాడీలలో ఏదైనా ప్రాబ్లమ్‌ ఉంటే మ్యూస్‌ క్యూ ఇట్టే పసికడుతుందట! 30 సెకన్లలోనే యాప్‌ ద్వారా మనల్ని అలెర్ట్‌ చేస్తుందని మ్యూస్‌ వేరబుల్స్‌ సీఈవో చెబుతున్నారు. 29 దేశాలలో ఈ యాప్‌ అమ్మకాలు జరుగుతున్నాయట!