IBPS RRB Score Card 2020: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నియామకాలు చేపట్టే ప్రముఖ సంస్థ ఇటీవల ఆర్‌ఆర్‌బీ (పీఓ) పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థుల స్కోర్ కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్ తెలిపింది. గ్రూప్ A-ఆఫీసర్ స్కేల్ 1 (పీఓ) ప్రిలిమినరీ పోస్టులను భర్తీ చేయడం కోసం ఐబీపీఎస్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌ను గతేడాది సెప్టెంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inలో అందుబాటులో ఉంచారు. ఈ స్కోర్ కార్డులను జనవరి 30 వరకు అందుబాటులో ఉంచనున్నారు.
* మొదట ఐబీపీస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inలోకి వెళ్లాలి.
* అనంతరం ‘Click here to View Your Scores of Online Preliminary Examination for CRP RRB IX – Officers Scale I’అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత.. ఓపెన్ అయిన కొత్త పేజీలో లాగిన్ వివరాలు (రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది) ఇవ్వాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ ఫలితాలను స్క్రీన్‌పై చూడొచ్చు.
Also Read: Rakul Preet Singh : షూటింగ్ కు సైకిల్ పైన వెళ్లిన హీరోయిన్..12 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన రకుల్