IBPS Exams Calendar : బ్యాంకు కొలువుల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పరీక్ష తేదీలను రిలీజ్ చేసిన ఐబీపీఎస్

|

Feb 18, 2021 | 6:11 PM

కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. తాజాగా ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంక్ ల్లో ఉద్యోగాలు సంపాదించాలని అనుకునే నిరుదోగులకు ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది...

IBPS Exams Calendar :  బ్యాంకు కొలువుల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పరీక్ష తేదీలను రిలీజ్ చేసిన ఐబీపీఎస్
Follow us on

IBPS Exams Calendar : కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. తాజాగా ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంక్ ల్లో ఉద్యోగాలు సంపాదించాలని అనుకునే నిరుదోగులకు ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది పరీక్షా క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. ఈ కాలెండర్ లో సవరించిన పరీక్ష తేదీలు, త్వరలో నిర్వహించే ఎగ్జామ్స్, రాబోయే బ్యాంక్ పరీక్షలు, ఉద్యోగాల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇది బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకోవాలని కష్టపడే నిరుద్యోగులకు చక్కటి అవకాశం అని చెప్పొచ్చు.

ఈ ఐబీపీఎస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్స్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, రీజనల్ రురల్ బ్యాంక్ ల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ , ఆఫీసర్ స్కెల్ 1, 2, 3 పోస్టుల భర్తీకి నియామకం చేపట్టనుంది.
*2021లో ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ను ఆగస్టు 1,7,8,14,21 తేదీల్లో నిర్వహించనున్నారు.
*ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ పరీక్ష తో పాటు ఆఫీసర్ స్కేల్-2,3 సింగిల్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ 25న ఉంటుంది.
*ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్ష అక్టోబర్ 3న నిర్వహిస్తారు.

పరీక్ష నిర్వహణ పోస్టుల వివరాలు :

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ ప్రకారం .. గ్రూప్-ఎ ఆఫీసర్స్(స్కేల్-1, 2, 3), గ్రూప్-బీలో ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులు ఉన్నాయి.

ఆఫీసర్స్ స్కేల్-1, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ, మెయిన్ అనే రెండు దశల్లో పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ అవుతారు.

ఆఫీసర్స్ స్కేల్-1 పోస్టులకు మెయిన్ తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆఫీసర్స్ స్కేల్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష అనంతరం పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ కాల్ వస్తుంది.

ఇక ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నారు. ఈ పరీక్ష‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటన్నింటికి 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యినవారు మెయిన్స్ పరీక్ష కూడా మల్టిఫుల్ చాయిస్ లో రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు- 200 మార్కులకు ఉంటాయి. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్, హిందీ భాషల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఆఫీసర్ స్కేల్-1: ప్రిలిమ్స్, మెయిన్ పరీక్ష ఆఫీస్ అసిస్టెంట్ మాదిరిగానే ఉంటుంది. కానీ న్యూమరికల్ ఎబిలిటీకి బదులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అదనంగా ఉంటుంది.

ఆఫీసర్ స్కేల్-2 జనరల్ బ్యాంకింగ్ దీనికి సింగిల్ పరీక్ష ఉంటుంది. స్కేల్-2 జనరల్ బ్యాంకింగ్, ఆఫీసర్ స్కేల్-3(స్పెషలిస్ట్ క్యాడర్) పరీక్షలు ఒకేలా ఉంటాయి. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్, హిందీ భాషల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. స్కేల్-2 స్పెషలిస్ట్ క్యాడర్ ఎగ్జామ్‌లో అదనంగా ఫ్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం ఉంటుంది.

Also Read:

 వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త.. త్వరలో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే..!

 దూకుడుగా వ్యవహరిస్తున్న ఫేస్‌బుక్‌.. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ..