వైమానిక దళంలోకి రఫేల్‌ యుద్ధ విమానం

భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించబోతోంంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. రఫేల్‌ యుద్ధ విమానం ఇవాళ భారత వైమానిక దళంలోకి లాంఛనంగా చేరబోతున్నాయి.

వైమానిక దళంలోకి రఫేల్‌ యుద్ధ విమానం
Follow us

|

Updated on: Sep 10, 2020 | 7:26 AM

భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించబోతోంంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. రఫేల్‌ యుద్ధ విమానం ఇవాళ భారత వైమానిక దళంలోకి లాంఛనంగా చేరబోతున్నాయి. అంబాలాలోని ఏయిర్‌బేస్‌లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగనుంది. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. భారత వాయుసేన బలపేతం చేసే దిశగా రఫెల్ యుద్ధ విమానాలను కేంద్రం కొనుగోలు చేసిందిజ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్స్‌‌ నుంచి మొదటి దశలో ఐదు అత్యాధునిక యుద్ధ విమానాలు జూలై 27న అంబాలాకు చేరుకున్న విషయం తెలిసిందే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా, ఫ్రెంచ్‌ ప్రతినిధి బృందం ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్ననున్నారు.

అంబాలలో సంప్రదాయ పూజలు నిర్వహించిన అనంతరం రఫేల్‌ విమానం ఆవిష్కరించనున్నారు. అలాగే, రఫేల్‌, తేజస్‌ విమానాల ఎయిర్‌ డిస్‌ప్లే, అనంతరం రఫేల్‌ యుద్ధ విమానాలకు వాటర్‌ సెల్యూట్‌తో కార్యక్రమం ముగియనుంది. కార్యక్రమానంతరం భారత, ఫ్రెంచ్‌ ప్రతినిధి బృందం ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. రక్షణ శాఖకు మరింత సాయం అందించేందుకు అవసరమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.