సడన్ గా నిలిచిపోయిన ఐఏఎఫ్ విమానం.. కారణమేంటంటే..

| Edited By:

May 01, 2020 | 5:04 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన ఓ విమానం సరిగ్గా టేకాఫ్

సడన్ గా నిలిచిపోయిన ఐఏఎఫ్ విమానం.. కారణమేంటంటే..
Follow us on

IAF plane: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమయ్యాయి. ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కి చెందిన ఓ విమానం సరిగ్గా టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో టైరు పేలిపోయింది. వెంటనే టేకాఫ్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఐఏఎఫ్ వెల్లడించింది.

వివరాల్లోకెళితే.. “రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరం నుంచి ఓ డార్నియర్ విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఓ టైరు పేలిపోయింది. దీంతో కెప్టెన్ చాకచక్యంగా వ్యవహరించి టేకాఫ్ నిలిపివేశారు..’’ అని ఐఏఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. విమానం, అందులోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారనీ.. ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. కాగా కొద్దిసేపటి తర్వాత ఐఏఎఫ్ టెక్నికల్ సిబ్బంది ఆ విమానాన్ని రన్‌వే మీది నుంచి తొలగించారు.