అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మూడో వారం ముగింపుకు వచ్చింది. రెండో సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌కు టీఆర్పీ కూడా బాగా వస్తోంది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, రొమాన్స్ అభిమానుల్లో కాకా పుట్టిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తాజాగా ఈ షోపై స్పందించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అనసూయ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘కథనం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను బిగ్ బాస్ షో చూడలేక పోతున్నానని.. కానీ ప్రోమోస్‌ను మాత్రం రెగ్యులర్‌గా చూస్తానని చెప్పింది. షోలో ఉన్న కంటెస్టెంట్లందరూ అద్భుతంగా పెరఫార్మ్ చేస్తున్నారని కొనియాడింది. హౌస్‌లో ఉన్న అందరికి శుభాకాంక్షలు చెబుతూ.. తాను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసేంత తీరక, సమయం లేదని అనసూయ చెప్పుకొచ్చింది.
ఇక అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో వేచి చూడాలి.