జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన పవర్ ఫుల్ పంచ్‌లతో.. జడ్జ్‌లతో పాటు జనాల్ని కూడా కడుపుబ్బా నవ్వించేస్తాడు. అలాగే.. సెలబ్రిటీలపైన కూడా తనదైన శైలిలో డిఫెరెంట్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. హైపర్ ఆది.. తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమే. అనతికాలంలో స్టేజ్ కమెడియన్‌గా అసామాన్య ప్రజాదారణ సంపాదించాడు ఆది. అడల్ట్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తాడన్న పేరున్నా కూడా.. అతని కామెడీ స్కిట్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం టీవీ రేటింగ్‌ల పరంగానే కాదు, యూట్యూబ్‌లో స్కిట్ రిలీజైన రెండు రోజులవరకు అదే ట్రెండింగ్.
తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు ఆది. నాగాబాబు, రోజా, అనసూయల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే జబర్దస్త్ నుంచి మిమ్మల్ని పంపించేస్తే ఏం చేస్తారన్న యాంకర్ ప్రశ్నకు.. ఈ కింది విధంగా సమాధానం ఇచ్చాడు. అలా ఎలా పంపిచేస్తారు? అయినా.. దాని నుంచి మనమే వెళ్లిపోవాలి వెళ్లిపోవాలి తప్పించి.. వాళ్లు పంపించరు. ఒక వేళ అలా పంపించేస్తే.. ఎక్కడికెళ్లినా.. ఏదైనా చేయగలం అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను బాగా చదువుకున్నా.. అన్నీ తెలిసిన వాళ్లం కాబట్టి.. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలో తెలుసు. కాబట్టి.. ఏ ఫీల్డ్ కెళ్లినా నేను రాణించగలననే నమ్మకం నాకుంది. వాళ్లు నన్ను పంపించేశారు.. ఇప్పుడు నేనేం చేయాలనే కంగారు, భయాలు అయితే నాకు లేవని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.
Read More this also:
అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట
కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్
సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..
కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
హీరోయిన్ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..