అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ కరుణ మంతెన ఇన్ఫోసిస్ ప్రైజ్ 2023తో సత్కరించారు. సాంఘిక శాస్త్ర రంగానికి ఆమె చేసిన విశేషమైన కృషికి ప్రొఫెసర్ మంతెనాకు ఈ గుర్తింపు లభించింది. బెంగళూరులో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇన్ఫోసిస్ ప్రైజ్ 2023లో గోల్డ్ మెడల్, సైటేషన్‌తో పాటు యూఎస్ డాలర్లు (USD) 100,000 ప్రైజ్ మనీ ఆమె సొంతం అయింది. ఈ బహుమతి ఇంజనీరింగ్ విభాగంలోని కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్‌తో సహా మరికొన్ని రంగాల్లో విశేష కృషి చేసినందుకు వరిస్తుంది.
హైదరాబాద్ మహిళ కరుణ మంతెన సాంఘిక శాస్త్రాలలో బహుమతిని అందుకోగా, ఇతర ప్రముఖ అవార్డు గ్రహీతలలో ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్లు సచ్చిదా నంద్ త్రిపాఠి, అరుణ్ కుమార్ శుక్లా, సైన్స్ గ్యాలరీ బెంగళూరు వ్యవస్థాపక డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీ, అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెర్న్‌హోల్జ్ జాయింట్ ప్రొఫెసర్ అయిన భార్గవ్ భట్ ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..