వందేళ్ల చరిత్రను తిరగరాసిన భాగ్యనగర వర్ష బీభత్సం

|

Oct 14, 2020 | 1:10 PM

కుండపోత వర్షానికి హైద‌రాబాద్‌ తడిసిముద్దైంది. కనివిని ఎరుగని రీతిలో ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో గంటల తరబడి కురుస్తూనే ఉంది. మహానగరం భయంతో వణికిపోయింది.

వందేళ్ల చరిత్రను తిరగరాసిన భాగ్యనగర వర్ష బీభత్సం
Follow us on

కుండపోత వర్షానికి హైద‌రాబాద్‌ తడిసిముద్దైంది. కనివిని ఎరుగని రీతిలో ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో గంటల తరబడి కురుస్తూనే ఉంది. మహానగరం భయంతో వణికిపోయింది. వర్ష బీభత్సంతో విలవిలలాడింది. గంటల తరబడి దంచికొట్టిన వానతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అండమాన్‌లో ఏర్పడిన వాయుగుండం తీవ్ర ఉధృతితో గ్రేటర్‌ హైదరాబాద్‌ను తాకిన తర్వాత మంగళవారం పట్టపగలే ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. నగరం చీకటిగా మారింది. అప్పటివరకు జల్లులతో తడుస్తున్న నగరంలో ఒక్కసారిగా వర్షం విధ్వంసం ప్రదర్శించింది.

గ‌త రెండు రోజులు‌గా కురిసిన వాన‌ల‌కు.. పాత రికార్డుల‌న్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబ‌ర్ నెల‌లో హైద‌రాబాద్‌లో ఈ రేంజ్‌లో వర్ష కురవడం గ‌త వందేళ్ల‌లో ఇదే మొద‌టిసారి. 1903లో చివ‌రిసారి ఇలాంటి వ‌ర్షం కురిసిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్లడించారు. న‌గ‌రంలో గ‌త 24 గంట‌ల్లో సుమారు 191.8 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అయిన‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం వాయుగుండం తెలంగాణ దాటి క‌ర్నాట‌క‌లోని గుల్బ‌ర్గా దిశ‌గా వెళ్తోంది. డిప్రెష‌న్ వేగంగా మ‌హారాష్ట్ర దిశ‌కు ప‌య‌నిస్తున్న‌ట్లు ఐఎండీ అంచ‌నా వేస్తోంది. రానున్న 12 గంట‌ల్లో వాయుగుండం మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పేర్కొంది. దీని వ‌ల్ల మ‌ధ్య మ‌హారాష్ట్ర‌, కొంక‌న్‌, గోవా, క‌ర్నాట‌క‌, తెలంగాణ‌లో ప‌లు చోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే కురుసే అవ‌కాశం ఉందని ఐఎండీ డైర‌క్ట‌ర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.