ఆ వాహనాలు వేలానికి రెడీ..
పలు కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను విక్రయించేందుకు నగర పోలీసులు రంగం సిద్దం చేశారు. ఈ కోవకు చెందని వాహనాలు మొత్తం 2,981 ఉన్నాయి. వీటిని తీసుకోవడాని ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో వీటిని వేలం వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వివరించారు. విక్రయించాలనుకుంటున్న వాహనాలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలున్నా, యజమానులెవరైనా ఉన్నా తగిన పత్రాలతో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 15రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. […]
పలు కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను విక్రయించేందుకు నగర పోలీసులు రంగం సిద్దం చేశారు. ఈ కోవకు చెందని వాహనాలు మొత్తం 2,981 ఉన్నాయి. వీటిని తీసుకోవడాని ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో వీటిని వేలం వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వివరించారు. విక్రయించాలనుకుంటున్న వాహనాలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలున్నా, యజమానులెవరైనా ఉన్నా తగిన పత్రాలతో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 15రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రకటన వెలువడిన 15 రోజుల్లోగా ఎవరూ స్పందించకపోతే ఆ వాహనాలను వేలం వేస్తామన్నారు ఆయన తెలిపారు.
ఈ వాహనాలకు సంబంధించి మరిన్ని వివరాలను గోషామహల్ ఎస్సై నర్సింహమూర్తి ( 9490616637)ని సంప్రదించాలని, లేదా www.hyderabadpolice.gov.in సిటీ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజస్ట్రేషన్ నెంబర్లను కూడా చూడవచ్చని సీపీ తెలిపారు.