హిమాచల్ గవర్నర్‌గా కల్‌రాజ్ మిశ్రా
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పటికే కొత్త రాష్ట్రాల గవర్నర్‌ల నియామకాలను హిమాచల్ ప్రదేశ్‌నుంచి ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే మూడు నెలల్లో 10 రాష్ట్రాల గవర్నర్ పదవీ కాలం పూర్తి కానుంది. కల్‌రాజ్ మిశ్రా ఎన్డీఏ-1 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు 75 ఏళ్లు పైబడటంతో […]
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఇప్పటికే కొత్త రాష్ట్రాల గవర్నర్‌ల నియామకాలను హిమాచల్ ప్రదేశ్‌నుంచి ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చే మూడు నెలల్లో 10 రాష్ట్రాల గవర్నర్ పదవీ కాలం పూర్తి కానుంది.
కల్‌రాజ్ మిశ్రా ఎన్డీఏ-1 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు 75 ఏళ్లు పైబడటంతో 2017లో ఆపదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం వయసు మీద పడటంతో ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు.