అబ్బో.. ఈ కప్పకు ఫైవ్ స్టార్ రేంజ్‌కు మించి సదుపాయాలు
ముద్దుగా ఉంటాయని కుక్కలు, పిల్లులు, చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు ఇలా కొన్ని సాధు జంతువులను పెంచుకోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇంకా కొన్ని చోట్ల పులులు, మొసళ్లు వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుంటారనుకోండి. అయితే అలా పెంచుకునేవారికి చాలా ధైర్యం ఉంటుంది. ఇదంతా పక్కనపెడితే సవన్నా మైకెల్ల్ అనే ఓ యువతి టాబీ అనే కప్పను పెంచుకుంటోంది. దాన్ని పెంచుకోవడమే కాదు అందుకోసం తన ఇంట్లో ఓ ప్రత్యేకంగా ఓ గదిని కూడా తయారు చేసింది. […]
ముద్దుగా ఉంటాయని కుక్కలు, పిల్లులు, చిలకలు, కుందేళ్లు, తాబేళ్లు ఇలా కొన్ని సాధు జంతువులను పెంచుకోవడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇంకా కొన్ని చోట్ల పులులు, మొసళ్లు వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుంటారనుకోండి. అయితే అలా పెంచుకునేవారికి చాలా ధైర్యం ఉంటుంది. ఇదంతా పక్కనపెడితే సవన్నా మైకెల్ల్ అనే ఓ యువతి టాబీ అనే కప్పను పెంచుకుంటోంది. దాన్ని పెంచుకోవడమే కాదు అందుకోసం తన ఇంట్లో ఓ ప్రత్యేకంగా ఓ గదిని కూడా తయారు చేసింది. అందులో ఆ కప్పకు సకల సదుపాయాలు కల్పించింది. చిన్నపాటి డైనింగ్ డేబుల్, సోఫాసెట్, బాత్‌రూమ్, కంప్యూటర్, హర్మోనియం, చిన్నపాటి బెడ్.. అబ్బో ఇలా చాలా సదుపాయాలనే కల్పించింది మైకెల్. దీనికి సంబంధించిన ఫొటోలను ఇటీవల ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటికి చూసిన నెటిజన్లు.. అబ్బో.. ఈ కప్ప జాతకం బావుందే అంటున్నారు.
https://www.facebook.com/savannah.mikell/posts/10213861940359617