బాటిల్ క్యాప్ ఛాలెంజ్: సల్లూభాయ్ మెసేజ్ ఏంటంటే..!

రోజుకో కొత్త ఛాలెంజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యులు ఆ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ తమ ప్రతిభను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెటిజన్లను షేక్ చేస్తోన్న ఛాలెంజ్ బాటిల్ క్యాప్ ఛాలెంజ్. చేతితో తీయకుండా బాటిల్ క్యాప్‌ను ఎలా తీస్తారు..? ఇదే ఆ ఛాలెంజ్ ఉద్దేశం. దీనిని స్వీకరిస్తూ అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, సుధీర్ బాబు, కార్తికేయ, రితేష్ దేశ్‌ముఖ్, పరిణీతి చోప్రా వంటి వారు కాలితో తమ స్టైల్‌లో […]

బాటిల్ క్యాప్ ఛాలెంజ్: సల్లూభాయ్ మెసేజ్ ఏంటంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 15, 2019 | 5:04 PM

రోజుకో కొత్త ఛాలెంజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో సెలబ్రిటీలను మొదలుకొని సామాన్యులు ఆ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ తమ ప్రతిభను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెటిజన్లను షేక్ చేస్తోన్న ఛాలెంజ్ బాటిల్ క్యాప్ ఛాలెంజ్. చేతితో తీయకుండా బాటిల్ క్యాప్‌ను ఎలా తీస్తారు..? ఇదే ఆ ఛాలెంజ్ ఉద్దేశం. దీనిని స్వీకరిస్తూ అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, సుధీర్ బాబు, కార్తికేయ, రితేష్ దేశ్‌ముఖ్, పరిణీతి చోప్రా వంటి వారు కాలితో తమ స్టైల్‌లో బాటిల్‌ మూతను తీశారు. ఇక కొందరైతే వినూత్నంగా ఆలోచించి కేకలు వేస్తూ.. దేవుడిలా అభయం ఇస్తూ బాటిల్ నుంచి మూతను వేరు చేశారు. తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం అందరికీ ఓ మెసేజ్‌ను ఇచ్చాడు.

ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసిన సల్మాన్ అందులో.. మొదట బ్యాటిల్ క్యాప్‌ను తీసేందుకు సిద్ధమైన వాడిలా ఉంటాడు. ఆ తరువాత బాటిల్‌కు దగ్గరగా వచ్చి నోటితో మూతను తీసి నీటిని తాగేస్తాడు. ఇక ఈ వీడియోను షేర్ చేసిన సల్లూ.. నీటిని వృధా చేయకండి.. నీటిని కాపాడండి అనే కామెంట్ పెట్టాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. నీటిని కాపాడుకునేందుకు సల్లూ భాయ్ మంచి మెసేజ్ ఇచ్చాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/Bz5bVXOlBrE/

కాగా ఈ ఏడాది భారత్‌తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సల్మాన్.. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తుండగా.. డిసెంబర్ 2019న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు సంజయ్ లీలా దర్శకత్వంలో ఇన్షాల్లా మూవీలో నటించనున్నాడు. ఇందులో ఆయన సరసన అలియా భట్ నటిస్తుండగా.. వచ్చే ఏడాది రంజాన్‌కే ప్రేక్షకుల ముందుకు రానుంది.