చేపల్లో జంబలకిడి పంబ!..నిజమంటున్న శాస్త్రవేత్తలు

ఇప్పుడు అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చింది. మరికొన్ని సంవత్సరాలలో స్టీమ్ సెల్స్‌తో చనిపోయిన మనిషిని బ్రతికించినా ఆశ్యర్యం లేదు. ఈ అభివృద్దిలో భాగంగానే గత కొంతకాలంగా  లింగ మార్పిడి ఆపరేషన్లతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిలా మారిపోతున్నారు. అయితే, కొన్ని చేపలు మాత్రం ఎలాంటి ఆపరేషన్స్  అవసరం లేకుండా లింగమార్పిడి చేసుకుంటున్నాయంటే నమ్ముతారా?..అవునండీ! ఈ విషయం తెలిసి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలే అవాక్కయ్యారు. చేపల్లో చాలా రకాల జాతులున్నాయి. అందులో మనకు తెల్సినవి కొన్నే.. తెలియనవి లక్షల్లో […]

చేపల్లో జంబలకిడి పంబ!..నిజమంటున్న శాస్త్రవేత్తలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 16, 2019 | 11:26 AM

ఇప్పుడు అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చింది. మరికొన్ని సంవత్సరాలలో స్టీమ్ సెల్స్‌తో చనిపోయిన మనిషిని బ్రతికించినా ఆశ్యర్యం లేదు. ఈ అభివృద్దిలో భాగంగానే గత కొంతకాలంగా  లింగ మార్పిడి ఆపరేషన్లతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిలా మారిపోతున్నారు. అయితే, కొన్ని చేపలు మాత్రం ఎలాంటి ఆపరేషన్స్  అవసరం లేకుండా లింగమార్పిడి చేసుకుంటున్నాయంటే నమ్ముతారా?..అవునండీ! ఈ విషయం తెలిసి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలే అవాక్కయ్యారు.

చేపల్లో చాలా రకాల జాతులున్నాయి. అందులో మనకు తెల్సినవి కొన్నే.. తెలియనవి లక్షల్లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక  500 రకాల చేపలు తొలుత ఆడ చేపలుగా ఉండి, ఆ తర్వాత కాలక్రమేణా మగ చేపలుగా మారిపోతున్నాయి. అంతేకాదు.. అలా సెక్స్ మార్పిడి జరిగిన పదిరోజుల్లోనే అవి ఆడ చేపలతో సంభోగంలో పాల్గొంటున్నాయి.

న్యూజిలాండ్‌లోని ఒటాగో శాస్త్రవేత్తలు లింగమార్పిడి చేసుకునే చేపలపై ప్రత్యేక పరిశోధనలు జరిపారు. వారిలో ఒకరైన ఎరికా టడ్ మాట్లాడుతూ.. ‘‘నీలి రంగు తల ఉండే వ్రస్సే, క్లోన్‌ఫిష్‌ రకాలకు చెందిన ఆడ చేపలు మధ్యవయస్సులో మగ చేపలుగా మారిపోతాయి. మొదట్లో ఆడ చేపగా మగ చేపలతో కలిసి జీవిస్తాయి. మగ చేప చనిపోయిన తర్వాత.. వాటి జీవన ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. పరిస్థితులకు అనుగుణంగా అది క్రమేణా మగ చేపలా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత వాటిలో గర్భం దాల్చేందుకు ఉపయోగపడే ఈస్ట్రోజన్ హార్మోన్ ‘అరోమాటసీ’ ఉత్పత్తి నిలిచిపోతుంది. అనంతరం శరీర మార్పులు జరుగుతాయి. పురుష చాపలకు ఉండే అవయవాలు ఆటోమేటిక్‌గా ఫామ్ అవుతాయి. ఆ తర్వాత ఆ చేపలు ఆడ చేపలతో ప్రత్యుత్పత్తిలో కూడా పాల్గొంటాయి’’ అని తెలిపారు.