చైనా చింపాంజీ దూకుడు.. కుమ్ముడే కుమ్ముడు !
అసలే కోతి.. ఆపైన తాగినా..తాగకున్నా.. మంచి వయస్సులో ఉంది.. ఇంకేం ! ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. తనను పట్టుకోబోయిన జూ కీపర్ మీద విరుచుక పడింది. పైగా అచ్ఛు మనిషి తన్నినట్టే అతడ్ని తన్నుతూ..కింద పడేసి.. అంతటితో ఆగక జూ కి వఛ్చిన విజిటర్ల మీదా దాడి చేయబోయింది. దీంతో అంతా భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అదే సందర్భంలో ఓ విజిటర్ కూడా ఆ చింపాంజీ దాడికి గురయ్యాడు. అందర్నీ తప్పించుకుని అది ఓ చెట్టుపైకి […]
అసలే కోతి.. ఆపైన తాగినా..తాగకున్నా.. మంచి వయస్సులో ఉంది.. ఇంకేం ! ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. తనను పట్టుకోబోయిన జూ కీపర్ మీద విరుచుక పడింది. పైగా అచ్ఛు మనిషి తన్నినట్టే అతడ్ని తన్నుతూ..కింద పడేసి.. అంతటితో ఆగక జూ కి వఛ్చిన విజిటర్ల మీదా దాడి చేయబోయింది. దీంతో అంతా భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అదే సందర్భంలో ఓ విజిటర్ కూడా ఆ చింపాంజీ దాడికి గురయ్యాడు. అందర్నీ తప్పించుకుని అది ఓ చెట్టుపైకి చేరుకోగా జూ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు మత్తుమందుతో కూడిన ట్రాంక్వి లైజర్ ప్రయోగించి మొత్తానికి దాన్ని అదుపు చేయగలిగారు. మళ్ళీ జూలోకి చేర్చారు. చైనా లోని హైఫై వైల్డ్ లైఫ్ పార్కులో ఇటీవల జరిగిన ఈ వైనం వీడియోకెక్కి వైరల్ అయింది. అన్నట్టు 12 ఏళ్ళ వయస్సు గల ఆ చింపాంజీ పేరు యాంగ్ యాంగ్ అట. ఇది చేసిన ‘ బీభత్సం ‘ లో ఎవరూ గాయపడనప్పటికీ.. దాని ‘ ప్రభంజనం ‘ మాత్రం ‘ అబ్బో ‘ అనిపించింది. .