బాలయ్యా.. ఇంగ్లండ్‌ను గెలిపించావయ్యా..! ఆటాడుకున్న నెటిజన్లు
హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్ 2019సమరంలో కప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. దీంతో మొదటిసారిగా వరల్డ్‌కప్‌ను సాధించింది ఇంగ్లండ్ టీమ్. అయితే ఆ టీమ్ అంత కసిగా ఆడి కప్ గెలవడానికి మన బాలయ్యనే స్పూర్తి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మేరకు బాలయ్య నటించిన ‘అధినాయకుడు’ సినిమాలోని ఓ క్లిప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అధినాయకుడు సినిమాలో ఓ సన్నివేశంలో మాట్లాడే బాలయ్య అందులో.. ‘‘క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లండ్ ఇంతవరకు […]
హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్ 2019సమరంలో కప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. దీంతో మొదటిసారిగా వరల్డ్‌కప్‌ను సాధించింది ఇంగ్లండ్ టీమ్. అయితే ఆ టీమ్ అంత కసిగా ఆడి కప్ గెలవడానికి మన బాలయ్యనే స్పూర్తి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మేరకు బాలయ్య నటించిన ‘అధినాయకుడు’ సినిమాలోని ఓ క్లిప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అధినాయకుడు సినిమాలో ఓ సన్నివేశంలో మాట్లాడే బాలయ్య అందులో.. ‘‘క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లండ్ ఇంతవరకు వరల్డ్‌కప్ గెలవలేదు’’ అని అంటాడు. ఇక దీనిని తాజా గెలుపుకు అన్వయిస్తూ.. ‘‘బాలయ్య ఏదో ఫ్లోలో అంటే ఇంగ్లండ్ టీమ్ సీరియస్‌గా తీసుకుంది. అందుకే ఈసారి వరల్డ్‌కప్ కొట్టింది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
England has taken Balayya 's words seriously..@KartikDayanand pic.twitter.com/bhF0tNobKt
— durgaprasad (@durgaprasady) July 16, 2019