తెరుచుకున్న జూపార్క్… ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతి

మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దైంది. భారీ వరదలతో భాగ్యనగరంలోని జూపార్క్‌లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన నేపథ్యంలో రెండు రోజుల పాటు జూను అధికారులు మూసివేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 10:38 am, Fri, 16 October 20
తెరుచుకున్న జూపార్క్... ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతి

మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దైంది. భారీ వరదలతో భాగ్యనగరంలోని జూపార్క్‌లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన నేపథ్యంలో రెండు రోజుల పాటు జూను అధికారులు మూసివేశారు. దీంతో జూ సందర్శించాలనుకునే నగర వాసులతో పాటు పర్యాటకులు సైతం నిరాశ చెందారు. అయితే, గురువారం నగరంలో వర్ష తెరిపి ఇవ్వడంతో జూపార్క్‌ను తిరిగి తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ జూ ఆవరణలో నిలిచిన వరద నీటిని తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వాననీటిని ప్రధాన కాలువల ద్వారా బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. జంతు ప్రదర్శనశాలను సందర్శకులు తిలకించే విధంగా అధికారులు తీసుకున్న జాగ్రత్తలతో శుక్రవారం నుంచి తిరిగి సందర్శకులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని జూ పార్క్‌ క్యూరేటర్‌ క్షితిజా తెలిపారు. మరోవైపు కొవిడ్‌ వ్యాప్తి కారణంగా తగు నిబంధనలు పాటిస్తూ జూలోకి సందర్శకులను అనుమతిస్తామని ఆమె తెలిపారు.