ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్

| Edited By: Pardhasaradhi Peri

Oct 28, 2020 | 5:47 PM

గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్
Follow us on

గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ పరిధిలోని గాంధీనగర్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ నరేష్ బుధవారం ఎసిబి అధికారులకు దొరికిపోయారు. ఫోర్జరీ కేసులో కండిషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ.30 వేల మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఫోర్జరీ కేసులో కండిషన్ బెయిల్ కేసు విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కాగా ఫ్లాన్ చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ గాంధీనగర్ పోలీసుస్టేషన్ పై దాడి చేశారు. మరోవైపు, గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.