రెండేళ్లపాటు రోడ్లపై బిక్షాటన..ఇప్పుడు సొంతగా పండ్ల ట్రాలీ

దివ్యాంగురాలైన ఓ మహిళ రెండేళ్లపాటు బిక్షాటన చేసిన అనంతరం..ఇప్పుడు తన సొంత ఫ్రూట్ ట్రాలీని ఏర్పాటు చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది.

రెండేళ్లపాటు రోడ్లపై బిక్షాటన..ఇప్పుడు సొంతగా పండ్ల ట్రాలీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 29, 2020 | 4:20 PM

దివ్యాంగురాలైన ఓ మహిళ రెండేళ్లపాటు బిక్షాటన చేసిన అనంతరం..ఇప్పుడు తన సొంత ఫ్రూట్ ట్రాలీని ఏర్పాటు చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది. రమాదేవి రోడ్లపై యాచించడం నుంచి ప్రారంభమై..ఇప్పుడు సొంతంగా  ఫ్రూట్స్ ట్రాలీని ఏర్పాటు చేసుకుని తన జీవిత గమనాన్ని మార్చుకుంది. చిన్న వయసులోనే పోలియో బారిన పడి కాళ్లు పోగొట్టుకున్నానని ఆమె ఆవేదనతో చెప్పింది.

“పోలియో కారణంగా నా కాళ్లు చిన్న వయస్సులోనే పనిచేయడం మానేశాయి. వైకల్యం ఉన్నప్పటికీ, నేను పాఠశాల విద్యను పూర్తి చేశాను.  జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి నా పదవ తరగతి,  నల్గొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ చేసాను” అని ఆమె చెప్పారు. కన్న తల్లీదండ్రులు ఎవరో తెలియకముందే, చాలా చిన్న వయస్సులోనే ఒక కుటుంబం రమాదేవిని దత్తత తీసుకుంది. ఆమె హైస్కూల్ పూర్తి చేసిన తరువాత,  వివాహం చేసుకుని హైదరాబాద్‌కు వెళ్లింది. తన వైవాహిక జీవితం  ఏడు సంవత్సరాలు ఆనందంగా గడిచిన తరువాత, రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయింది.

“ పెళ్లి అనంతరం నా భర్తతో నేను చాలా  సంతోషంగా ఉన్నాను. కానీ రెండేళ్ల క్రితం నా భర్తను కోల్పోయాను. అతను మరణించిన తర్వాత, నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా ముగ్గురు పిల్లలను సాకడానికి డబ్బు కోసం యాచించడం ప్రారంభించాను. రెండేళ్లుగా నేను హైదరాబాద్ రోడ్లపై యాచించడం కొనసాగించాను ”అని ఆమె ధీనంగా చెప్పారు. 

రమాదేవికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు జన్మనిచ్చిన తరువాత, ఆమె తన భర్తతో కలిసి ఒక కుమార్తెను దత్తత తీసుకుంది. రెండేళ్లుగా ఆమె యాచించినప్పటికీ,  తన పిల్లలను పాఠశాలకు పంపించడం మానలేదు. ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతున్నా ఇప్పుడు కూడా ఆమె తన పిల్లల్ని స్కూల్‌కి పంపుతుంది. “యాచించేటప్పుడు రోడ్డుపై నా కాళ్లు,  చేతులు డోక్కుపోయి రక్తస్రావం కావడాన్ని చూసిన తరువాత నాకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వీల్ చైర్ ఇచ్చాడు.  ఈ జీవితం భరించచలేక  చనిపోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, దేవుడు నన్ను అన్ని సమయాలలో రక్షించుకుంటూ వచ్చాడు” అని ఆమె చెప్పింది.

“గత రెండేళ్లుగా రమాదేవి యాచించడం, ఆమె పరిస్థితి చూసి మాకు బాధగా ఉండేది. ఇప్పుడు ఫ్రూట్ ట్రాలీని ఏర్పాటు చేసుకుని ఆమె తన సొంత వ్యాపారంలో నిమగ్నమై ఉన్నందుకు ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము ” అని స్థానిక అమ్మకందారుడు షేక్ అఫ్సర్ అన్నారు. 

Also Read :

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

అప్పట్లో పెళ్లి చేసుకుంటే దేవుడికి కూడా కట్నం ఇచ్చేవారట !