బోయిన్ పల్లి కిడ్నాప్ : అఖిల ప్రియ.. నెంబర్ 1, నిందితుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను మ్యాప్‌ ద్వారా చూపించిన సీపీ

|

Jan 11, 2021 | 3:59 PM

హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావ్ సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ-1 నిందితురాలిగా ఉన్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ చెప్పారు...

బోయిన్ పల్లి కిడ్నాప్ :  అఖిల ప్రియ.. నెంబర్ 1, నిందితుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను మ్యాప్‌ ద్వారా చూపించిన సీపీ
Follow us on

హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ప్రవీణ్ రావ్ సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ-1 నిందితురాలిగా ఉన్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ చెప్పారు. నిందితులు మల్లిఖార్జున్‌రెడ్డి, మాదాల శ్రీను పేర్లతో సిమ్‌కార్డులు కొన్నారు.. ఈ సిమ్‌ నంబర్‌ను అఖిలప్రియ కూడా ఉపయోగించారని సీపీ వెల్లడించారు. అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్టు చేశామని, కిడ్నాప్ కి ముందు నిందితులు బోయిన్ పల్లిలో రెక్కీ నిర్వహించారని వెల్లడించారు. అఖిల ప్రియ సూచన మేరకే ప్రవీణ్‌రావు ఇంటి వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారని ఆయన తేల్చి చెప్పారు.

కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అంజనీకుమార్‌ వెల్లడించారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణను మ్యాప్‌ ద్వారా చూపించారు సీపీ. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితులు వాడిన ఫోన్లు, వాహనాల నకిలీ నంబర్‌ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారన్నారు.