రోడ్డెక్కిన ఆటోవాలా

|

Sep 24, 2020 | 4:28 PM

ప్రైవేటు ఫైనాన్షియర్ల దోపిడి అరికట్టాలని కోరుతూ ఖైరతాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వెహికల్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కుషాల్ టవర్స్‌ ఎదుట భైటాయించారు. కరోనా కారణంగా ఆరు నెలలుగా..

రోడ్డెక్కిన ఆటోవాలా
Follow us on

Auto drivers : ప్రైవేటు ఫైనాన్షియర్ల దోపిడి అరికట్టాలని కోరుతూ ఖైరతాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వెహికల్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కుషాల్ టవర్స్‌ ఎదుట భైటాయించారు. కరోనా కారణంగా ఆరు నెలలుగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రైవేట్ ఫైనాన్షియర్లు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ నిబంధనలు పెట్టినప్పటికి ప్రైవేటు ఫైనాన్షియర్లు పట్టించుకోకుండా …రెచ్చిపోతున్నారని విమర్శించారు. ప్రైవేటు ఫైనాన్షియర్లు ఆటో డ్రైవర్లను చితకబాదిన పోలీసులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లను వేధిస్తున్న ప్రైవేటు ఫైనాన్షియర్లపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.