ఏపీ: ఐదు నిమిషాల్లో కరోనా టెస్ట్.. పది నిమిషాల్లో ఫలితం..

Sanjeevini Mobile Center: ఏపీలో చేస్తోన్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదివరకు కరోనా పరీక్షకు సాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఫలితాల కోసం మూడు రోజుల పాటు ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ‘సంజీవిని’ సంచార ల్యాబ్‌లతో టెస్టు చేయించుకున్న తర్వాత పది నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తోంది. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా డిపోల్లో ఉన్న ఇంద్ర బస్సులను ‘సంజీవిని’ పేరుతో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మార్చింది. వీటిల్లో ర్యాపిడ్ […]

ఏపీ: ఐదు నిమిషాల్లో కరోనా టెస్ట్.. పది నిమిషాల్లో ఫలితం..

Updated on: Jul 19, 2020 | 8:42 PM

Sanjeevini Mobile Center: ఏపీలో చేస్తోన్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదివరకు కరోనా పరీక్షకు సాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఫలితాల కోసం మూడు రోజుల పాటు ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ‘సంజీవిని’ సంచార ల్యాబ్‌లతో టెస్టు చేయించుకున్న తర్వాత పది నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తోంది.

రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి బాగా పెరిగిపోతున్న నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా డిపోల్లో ఉన్న ఇంద్ర బస్సులను ‘సంజీవిని’ పేరుతో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా మార్చింది. వీటిల్లో ర్యాపిడ్ యాంటీ టెస్టింగ్ కిట్‌లను ఉపయోగించి వేగవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఒకేసారి పది మందికి పరీక్ష చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు రూ. 3 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా పరీక్ష, ఫలితాల వెల్లడి కేవలం 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..