Hyundai Grand i10 Nios: ఈ కారుపై రూ. 45,000 వరకూ తగ్గింపు.. త్వరపడండి.. ఈ నెలాఖరు వరకే అవకాశం
మీరు ఏదైనా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా చిన్న కుటుంబానికి సరిపోయే చిన్న కారు కావాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హ్యూందాయ్ నుంచి అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కొత్త సంవత్సరంలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై దాదాపు రూ. 45,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈ నెలాఖరు వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మీరు ఏదైనా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా చిన్న కుటుంబానికి సరిపోయే చిన్న కారు కావాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హ్యూందాయ్ నుంచి అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కొత్త సంవత్సరంలో హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై దాదాపు రూ. 45,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈ నెలాఖరు వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆఫర్లు ఇలా..
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ నాలుగు విభిన్న వేరియంట్‌లలో వస్తుంది. ఎరా, మాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా. ఈ కారు ధర రూ. 5.92 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ హ్యుందాయ్ మోడల్‌ను రిజర్వ్ చేయాలనుకునే కస్టమర్‌లు ఎంవై2024, ఎంవై2023 వెర్షన్‌ల మధ్య ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కటి విభిన్న డిస్కౌంట్ ఆఫర్‌లతో ఉంటాయి. ఎంవై2024 మోడల్ పెట్రోల్ వేరియంట్‌లకు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌కు అర్హమైనవి. అయితే ఎంవై2023 మోడల్ పెట్రోల్ వేరియంట్‌లు రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందుతాయి. సీఎన్జీ వేరియంట్‌ల గురించి ఆలోచిస్తే ఎంవై2024 మోడల్‌కు రూ. 20,000 నగదు తగ్గింపుతో పాటు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అదే సమయంలో ఎంవై2023 వెర్షన్ రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను కలిగి ఉంది. గ్రాండ్ ఐ10 నియోస్ స్పెక్స్, ఫీచర్లు, డిజైన్ వివరాలను ఇప్పుడు చూద్దాం..
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పవర్‌ట్రెయిన్..
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ ఫ్యాక్టరీ-ఇన్‌స్టాల్ చేసిన సీఎన్జీ కిట్‌తో ఒక ఎంపికగా వస్తుంది. స్టాండర్డ్ మోడ్‌లో గరిష్టంగా 82బీహెచ్పీ శక్తిని, 114ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సీఎన్జీ మోడ్‌లో పనిచేసేటప్పుడు 68బీహెచ్పీ గరిష్ట శక్తిని, 95ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండూ పెట్రోల్ ఇంజిన్ కు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో సీఎన్జీ యూనిట్ 5-స్పీడ్ ఎంటీతో వస్తుంది. రెండు పవర్‌ట్రెయిన్‌లు కఠినమైన ఆర్డీఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ డిజైన్..
డిజైన్ పరంగా, హ్యాచ్‌బ్యాక్ ముందు భాగంలో షార్క్‌ఫిన్ యాంటెన్నా, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ వై- ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్, రీడిజైన్ చేసిన గ్రిల్ ఉన్నాయి. వెనుకవైపు డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ను కూడా కలిగి ఉంది. టైటాన్ గ్రే, టీల్ బ్లూ, ఫైరీ రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, స్పార్క్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇంకా, బ్లాక్ రూఫ్‌లతో స్పార్క్ గ్రీన్, పోలార్ వైట్ వంటి ఇతర డ్యూయల్-టోన్ పెయింట్ జాబ్‌లు కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్స్..
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పూర్తిగా ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, టీపీఎంఎస్ డిస్‌ప్లేతో కూడిన 3.5-అంగుళాల స్పీడోమీటర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, టైప్ సీ ఫాస్ట్ యూఎస్బీ ఛార్జర్, స్మార్ట్‌ఫోన్ నావిగేషన్‌తో కూడిన 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఆడియో డిస్‌ప్లే, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్టు ఉంటుంది. అలాగే మెటల్ ఫినిషింగ్‌తో ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్‌తో కూడిన స్మార్ట్ కీ, పైపింగ్, నియోస్ ఎంబాసింగ్‌తో కూడిన గ్రే అప్హోల్స్టరీ, లెదర్‌తో కూడిన స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
నాలుగు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఆరు ఆప్షనల్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లతో పార్కింగ్ అసిస్ట్, వెనుక కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








