AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: పచ్చి మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే.. కస్టమర్‌కు చేదు అనుభవం..

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ సేల్ పేరిట ఓ సేల్ ను నిర్వహించింది. ఈ సేల్లో ఐఫోన్ 15 బుక్ చేసిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. ఐఫోన్ 15 ఫోన్లో వచ్చిన బ్యాటరీ ఫేక్. దీంతో షాక్ అయిన ఆ కస్టమర్ రిప్లేస్ మెంట్ కోసం దరఖాస్తు చేసినా.. ఫ్లిప్ కార్ట్ ఆ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. దీంతో ఆ వినియోగదారులు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన అనుభవాన్ని, బాధను వ్యక్తపరిచారు.

Flipkart: పచ్చి మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే.. కస్టమర్‌కు చేదు అనుభవం..
Iphone 15
Madhu
|

Updated on: Jan 23, 2024 | 8:42 AM

Share

ఇటీవల కాలంలో ఆన్ లైన్ సేల్స్ బాగా పెరిగాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిల్లో మంచి ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్ ఉండటంతో వినియోగదారులు వస్తువులను వాటిల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి పండుగకు ఆన్ లైన్లో ఏదో ఒక ప్రత్యేక సేల్స్ నడుపుతున్నాయి. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ సేల్ పేరిట ఓ సేల్ ను నిర్వహించింది. ఈ సేల్లో ఐఫోన్ 15 బుక్ చేసిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. ఐఫోన్ 15 ఫోన్లో వచ్చిన బ్యాటరీ ఫేక్. దీంతో షాక్ అయిన ఆ కస్టమర్ రిప్లేస్ మెంట్ కోసం దరఖాస్తు చేసినా.. ఫ్లిప్ కార్ట్ ఆ దరఖాస్తును రిజెక్ట్ చేసింది. దీంతో ఆ వినియోగదారులు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన అనుభవాన్ని, బాధను వ్యక్తపరిచారు. ఇది చూసిన నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అసలేం జరిగిందంటే..

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అజయ్ రాజావత్ అనే వ్యక్తి ఐఫోన్ 15 కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఫోన్ రిసీవ్ చేసుకోగా అది నకిలీ బ్యాటరీతో వచ్చిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అయితే ఫ్లిప్ కార్ట్ కు దీనిని నివేదించగా.. రిప్లేస్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిందని వివరించాడు. దీంతో ఆ వ్యక్తి తన ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్) లో ఫోటోలు, వీడియోను కూడా షేర్ చేశాడు. ఫ్లిప్ కార్ట్ కొత్త పరికరాన్ని రిప్లేస్ చేయడానికి నిరాకరించిందని కూడా పేర్కొన్నాడు. తాను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్ 15ని ఆర్డర్ చేసానని.. దానిని జనవరి 15న డెలివరీ పొందానని చెప్పాడు. కానీ తనను ఫ్లిప్ కార్ట్ మోసం చేసిందని ట్విట్ చేశాడు. లోపభూయిష్ట ఐఫోన్ 15ని తనకు అందించారని, బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదని చెప్పకొచ్చాడు. దీనిని రిప్లేస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే దాని కూడా ఫ్లిప్ కార్ట్ నిరాకరించిందని వివరించాడు.

ఇవి కూడా చదవండి

రెండు చిత్రాలు, వీడియోను కూడా షేర్ చేశాడు. ఈ చిత్రాలలో ఒకటి ఐఫోన్ మెసేజ్. దానిలో ‘మీ ఐఫోన్ బ్యాటరీ నిజమైన ఆపిల్ భాగమో కాదో నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఈ భాగం అసలైనది కాకపోవడం లేదా ఆశించిన విధంగా పనిచేయకపోవడం లేదా ఇన్‌స్టాలేషన్ పూర్తయినందున కావచ్చు’ అని ఆ మెసేజ్ ఉంది. మరొక చిత్రం ఐఫోన్ ‘బ్యాటరీ ఆరోగ్యం & ఛార్జింగ్’ని ప్రదర్శిస్తున్నట్లు చూపిస్తుంది, ఇక్కడ సందేశం ఇలా ఉంది, “ఈ ఐఫోన్‌లో నిజమైన ఆపిల్ బ్యాటరీ ఉందని ధ్రువీకరించడం సాధ్యం కాలేదు. ఈ బ్యాటరీకి సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో లేదు. అజయ్ రాజావత్ మరో ట్విట్ చేస్తూ.. తాను రిపబ్లిక్ సేల్లో ఐఫోన్ 15 ఆర్డర్ చేశానని, డెలివరీ అయిన ఐఫోన్ నకిలీదని.. ఫ్లిప్ కార్ట్ తనకు రిప్లేస్ మెంట్ కూడా ఇవ్వడం లేదని.. దీనికి పరిష్కారం ఏమిటని నెటిజనులు,తన ఫాలోవర్లను అడిగాడు. అయితే దీనిపై నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

కాగా ఇలాంటి సంఘటనే అమెజాన్ తో ఓ వినియోగదారుడికి అనుభవం అయ్యింది. తాను నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కూడిన సోనీ హెడ్ ఫోన్లు ఆర్డర్ చేస్తే ఆ వ్యక్తి దానికి బదులుగా కోల్ గేట్ టూత్ పేస్ట్ తో కూడిన ప్యాకేజీ వచ్చింది. ఆ వ్యక్తి ఆ ప్యాక్ ను అన్ బాక్సింగ్ చేసే వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. అమెజాన్ ను కూడా ట్యాగ్ చేశాడు. దీంతో దిగివచ్చిన అమెజాన్ ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పి.. దానిని రిప్లేస్ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..