AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాక్షన్ హీరోల ‘వార్’కు ఖాన్స్ రికార్డులు బ్రేక్!

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున బాలీవుడ్ బాక్సాఫీస్‌పై యాక్షన్ హీరోలు ‘వార్’ ప్రకటించారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి బాలీవుడ్‌తో పాటుగా ఖాన్స్ రికార్డులన్నీ కూడా చెరిగిపోయాయి. హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక యాక్షన్ ప్రియులకు ‘వార్’ ఫీస్ట్ ఇస్తుంది. దీంతో హిందీ ఫ్యాన్స్ […]

యాక్షన్ హీరోల 'వార్'కు ఖాన్స్ రికార్డులు బ్రేక్!
Ravi Kiran
|

Updated on: Oct 03, 2019 | 6:35 PM

Share

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున బాలీవుడ్ బాక్సాఫీస్‌పై యాక్షన్ హీరోలు ‘వార్’ ప్రకటించారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి బాలీవుడ్‌తో పాటుగా ఖాన్స్ రికార్డులన్నీ కూడా చెరిగిపోయాయి.

హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక యాక్షన్ ప్రియులకు ‘వార్’ ఫీస్ట్ ఇస్తుంది. దీంతో హిందీ ఫ్యాన్స్ ఈ సినిమాకు క్యూ కట్టారు. మొదటి రోజు అన్ని రికార్డులను చెరిపేస్తూ బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.53 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ రిలీజైనా కూడా ‘వార్’ ఈ మేరకు కలెక్షన్స్ రాబట్టిందంటే.. అదీ కూడా హృతిక్ రోషన్ వల్లే సాధ్యమైందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘వార్’ బ్రేక్ చేసిన రికార్డులను ఒకసారి పరిశీలిస్తే..

  • బాలీవుడ్‌లోనే ఇప్పటివరకు హయ్యెస్ట్ రికార్డు ఓపెనింగ్ డే వసూళ్లు కలెక్ట్ చేసింది ‘వార్’
  • హృతిక్ రోషన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
  • టైగర్ ష్రాఫ్‌, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌లకు కూడా ఈ సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డు నమోదైంది
  • బీ-టౌన్‌లో ఇప్పటివరకు హాలిడేస్‌లో విడుదలైన అన్ని సినిమాల కంటే ‘వార్’ దే హయ్యెస్ట్ ఓపెనింగ్స్
  • యష్ రాజ్ ఫిలిమ్స్‌కు కూడా ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్
  • బాలీవుడ్‌లో సీక్వెల్ కాకుండా.. ఒరిజినల్ సినిమాగా ఇప్పటివరకు రికార్డు ఓపెనింగ్స్ నమోదైంది ఈ సినిమాకే
  • బీ టౌన్‌లో గాంధీ జయంతి రోజున రిలీజైన అన్ని సినిమాల కంటే ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్

బాలీవుడ్‌లో ఖాన్స్ త్రయం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్స్., మరెన్నో ఇండస్ట్రీ హిట్స్‌తో బీ-టౌన్‌ను ఏలుతున్నారు. ఇప్పుడు హృతిక్ ‘వార్’ సినిమాతో ఈ త్రయం నమోదు చేసిన రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. క్రిటిక్స్ నుంచి అభిమానుల వరకు అందరూ కూడా ‘వార్’‌కు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చక్కటి కథతో అత్యద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది.

ఇద్దరు యాక్షన్ హీరోలు.. పైగా ప్రముఖ నిర్మాణ సంస్థ.. దీనితో ‘వార్’కు భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్టుగా ఫ్యాన్స్‌కు సినిమా విజువల్ ట్రీట్ ఇచ్చింది. అటు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాకు కూడా పోటీగా నిలిచింది.

రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?