వారియర్స్ కే ఫస్ట్ డోస్.. కరోనా వ్యాక్సిన్ పై జాన్సన్ అండ్ జాన్సన్ క్లారిటీ..
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది.కరోనా వ్యాక్సిన్ కోసం ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీతో అమెరికా భారీ డీల్ కుదుర్చుకుంది.

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ‘జాన్సన్ అండ్ జాన్సన్’ కంపెనీతో అమెరికా భారీ డీల్ కుదుర్చుకుంది. దీని విలువ రూ.3,438 కోట్లు. దీనికి సంబంధించిన ఒప్పందంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్ అండ్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ(బార్డా), జాన్సన్ అండ్ జాన్సన్ సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా 2021 మార్చిలోగా 100 కోట్ల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను జాన్సన్ అండ్ జాన్సన్ సమకూర్చనుంది.
కాగా.. జాన్సన్ & జాన్సన్ ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అందిస్తుందని, ఇది వైద్య కార్మికులకు, ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులు, నర్సులు, వైద్యులు, రోగులతో పనిచేసే వారికి మొదట అందుబాటులో ఉంటుందని చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టోఫెల్స్ తెలిపారు. ధర విషయానికొస్తే, ఇది సాధ్యమైనంత తక్కువగా ఉంటుందని మరియు జాన్సన్ & జాన్సన్ ఈ టీకాను లాభాపేక్షలేని ప్రాజెక్టుగా భావిస్తున్నారని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము పరీక్షిస్తున్న ఒక ‘లీడ్ క్యాండిడేట్ వ్యాక్సిన్’ అత్యుత్తమ ఫలితాలను అందిస్తోందని సంస్థ వెల్లడించింది.