కరోనా కట్టడికి.. బీసీజీ వ్యాక్సిన్..?

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇప్పుడు శతాబ్దం కిందటి వ్యాక్సిన్‌కు కరోనాతో పోరాడే శక్తి ఉందంటూ నెదర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టిన పిల్లలకు TB వంటి వైరస్ లు సోకకుండా బీసీజీ(BCG) అనే వ్యాక్యిన్ ను వాడుతారన్న విషయం దాదాపు భారత్ లో అందరు తల్లిదండ్రులకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ను కరోనాపై పోరాటానికి ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు.. టీకాల […]

కరోనా కట్టడికి.. బీసీజీ వ్యాక్సిన్..?
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 10:52 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇప్పుడు శతాబ్దం కిందటి వ్యాక్సిన్‌కు కరోనాతో పోరాడే శక్తి ఉందంటూ నెదర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టిన పిల్లలకు TB వంటి వైరస్ లు సోకకుండా బీసీజీ(BCG) అనే వ్యాక్యిన్ ను వాడుతారన్న విషయం దాదాపు భారత్ లో అందరు తల్లిదండ్రులకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ను కరోనాపై పోరాటానికి ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరోవైపు.. టీకాల ద్వారానే శ్వాసకోశ వ్యాధుల నుంచి శాశ్వత ఉపశమనం ఉంటుందని భావించడం సహజమైనందున.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీజీ ఆశాజనకంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే చూపిస్తోంది. ఇదే సమయంలో ఈ బీసీజీ వ్యాక్సిన్ ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే.. కరోనావైరస్ పై జరిగే పోరులో తాము కూడా బీసీజీ వ్యాక్సిన్ పట్ల ఆశాభావంతో ఉన్నామని, ప్రోత్సహించామని, కానీ ఏదైనా చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని భారతీయ నిపుణులు చెబుతున్నారు. కరోనా విషయంలోనూ ఇదొక ఆశాజనకంగా ఉన్నది. ఈ టీకా కరోనా తీవ్రతను తగ్గించవచ్చేమోగానీ పూర్తిగా నిర్మూలించలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని విశ్లేషిస్తే.. బీసీజీ వ్యాక్సిన్‌ను వినియోగించిన దేశాల్లో కరోనా తీవ్రత ఇతర దేశాల కంటే తక్కువగా ఉండటం తాజా అధ్యయన ఫలితానికి బలాన్ని చేకూరుస్తుంది.