ఇక పర్యాటకుల కోసం ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ పథకం

| Edited By:

Apr 20, 2019 | 12:08 PM

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ‘బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించనుంది. దీంతో పర్యాటకులకు తక్కువ ధరలకే పలు సౌకర్యాలు అందనున్నాయి. అదేవిధంగా స్థానిక టూరిస్టు గైడ్‌లకు కూడా ఉపాధి మెరుగుపడనుంది. ‘అతిథి దేవో భవ’ అనే సూక్తి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ యాత్రికులను అలరించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కారణంగా విదేశీ పర్యాటకులు భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోగలుగుతారు. […]

ఇక పర్యాటకుల కోసం ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ పథకం
Follow us on

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ‘బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించనుంది. దీంతో పర్యాటకులకు తక్కువ ధరలకే పలు సౌకర్యాలు అందనున్నాయి. అదేవిధంగా స్థానిక టూరిస్టు గైడ్‌లకు కూడా ఉపాధి మెరుగుపడనుంది. ‘అతిథి దేవో భవ’ అనే సూక్తి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీ యాత్రికులను అలరించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కారణంగా విదేశీ పర్యాటకులు భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోగలుగుతారు. ఈ బాధ్యతను సంబంధిత ఇంటి యజమానులకే అప్పగించనున్నారు. అయితే ఇందుకోసం వినియోగించే ఇళ్లను కేంద్ర పర్యాటకశాఖకు చెందిన అధికారులు పరిశీలించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇక్కడి ఇళ్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చూస్తుంది.