అంతా నీటిలోనే.. మధ్యప్రదేశ్‌లో వరద బీభత్సం

|

Aug 29, 2020 | 2:19 PM

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉగ్రరూపం దాల్చాయి.

అంతా నీటిలోనే.. మధ్యప్రదేశ్‌లో వరద బీభత్సం
Follow us on

Flash floods at Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉగ్రరూపం దాల్చాయి. దీంతో చింద్వారా చారుయ్‌ తహసీల్‌లోని..మచగోరా డ్యామ్‌ వద్ద ఓ యువకుడు వరద ప్రవాహంలో చిక్కుకుపోయాడు.

బాల్‌ఖేడా గ్రామానికి చెందిన ఆ యువకుడు.. 24 గంటలుగా అక్కడే ప్రాణాలతో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తనను కాపాడాలంటూ కేకలు వేయడంతో..అతన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూటీమ్‌ హెలికాఫ్టర్‌ సాయంతో..అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌,మధ్యప్రదేశ్‌లకు రెడ్‌ బులిటెన్‌ విడుదల చేసింది సీడబ్ల్యూసీ. అతి తీవ్ర స్థాయిలో వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. సీడబ్ల్యూసీ హెచ్చరికలతో అప్రమత్తమైన మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌..వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. జోరు వానలకు వరద పోటెత్తే అవకాశముందని..ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.