AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం పెట్ట‌లేద‌ని పెళ్లైన 10 నిమిషాల‌కే వ‌రుడు ఎస్కేప్

పెళ్లి అంటే రెండు నిండు జీవితాలు క‌లిసి ముందుకు వెళ్ల‌డం. పెళ్లి అంటే రెండు కుటుంబాల క‌ల‌యిక‌. పెళ్లి అంటే విడ‌దీయ‌రాని బంధం. పెళ్లి అంటే మ‌రో కొత్త జీవితం.

బంగారం పెట్ట‌లేద‌ని పెళ్లైన 10 నిమిషాల‌కే వ‌రుడు ఎస్కేప్
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2020 | 2:20 PM

Share

పెళ్లి అంటే రెండు నిండు జీవితాలు క‌లిసి ముందుకు వెళ్ల‌డం. పెళ్లి అంటే రెండు కుటుంబాల క‌ల‌యిక‌. పెళ్లి అంటే విడ‌దీయ‌రాని బంధం. పెళ్లి అంటే మ‌రో కొత్త జీవితం. అయితే ఇటీవ‌లి కాలంలో పెళ్లిళ్లు కామెడీ అయిపోయాయి. అడిగినంత క‌ట్నం ఇవ్వ‌క‌పోతే పీట‌లపైనే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లైన కొన్ని రోజుల్లోనే ఈగోలతో వివాహా బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇవి చాలా పెద్ద‌వి ఇంత‌కంటే చిన్న కార‌ణాల‌కే చేతులారా కాపురాల‌ను కూల్చుకుంటున్నారు. తాజాగా పెళ్లైన 10 నిమిషాల‌కే వ‌రుడు క‌నిపించ‌డకుండా మాయమ‌య్యాడు. అస‌లు స‌మ‌స్య ఏంటా అని ఆరా తీస్తే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ( తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు)

అత్తింటి వాళ్లు బంగారం పెట్ట‌లేద‌నే కోపంతో స‌ద‌రు మ‌హానుభావుడు అక్క‌డ్నుంచి నిష్క్ర‌మించాడ‌ట‌. ఈ ఘ‌ట‌న క‌దిరిలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..త‌లుపుల మండ‌లం ఓబుల‌రెడ్డి ప‌ల్లికి చెందిన చిన్న అనే యువ‌కుడికి, క‌దిరి ప‌ట్ట‌ణంలో నివ‌శించే అత‌డి అక్క కూతురుతోనే వివాహాన్ని కుదిర్చారు పెద్ద‌లు. శుక్ర‌వారం బంధుమిత్ర‌లను పిలిచి ఓ ఆల‌యంలో వివాహం కూడా జ‌రిపించారు. అయితే వ‌రుడికి మూడు తులాల బంగారం పెడ‌తామ‌ని చెప్పిన వ‌ధువు త‌ల్లిదండ్రులు ఆర్థిక సమ‌స్య‌లు వ‌ల్ల పెట్ట‌లేక‌పోయారు. దీంతో అత‌డు అక్క‌డ్నుంచి జంప్ అయ్యారు. అంతేకాదు త‌న‌కు ఇష్టం లేకుండా పెళ్లి చేశార‌ని పోలీసుల‌కు ముందుగానే ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు అంద‌ర్నీ కూర్చోబెట్టి మాట్లాడితే అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో వ‌రుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. (కడపజిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి)

Follow Us
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
నాని 'ప్యారడైజ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!