జడ్జి రామకృష్ణపై తహసీల్దార్ ఆదేశాలు తాత్కాలికంగా రద్దు

చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణను ఇంటి ముందున్న వివాదాస్పద రోడ్డుపైకి రావొద్దని తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జడ్జి రామకృష్ణపై తహసీల్దార్ ఆదేశాలు తాత్కాలికంగా రద్దు

Updated on: Sep 02, 2020 | 7:50 AM

చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణను ఇంటి ముందున్న వివాదాస్పద రోడ్డుపైకి రావొద్దని తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉన్న‌త న్యాయ‌స్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పది రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.

జడ్జి రామకృష్ణ ఇంటి నుంచి బయటకు రావాలంటే ఉన్నది ఒకటే దారని పిటిషన్ తరఫు లాయ‌ర్ వాదించారు. ఇంటి ముందు ఉన్న రోడ్డుపై నుంచి ప్రతిరోజూ బయటకు రావాల్సిన అవసరముంటుందని కోర్టుకు విన్న‌వించారు. తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తహసీల్దార్ ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ..తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.

 

Also Read :

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మ‌ర‌ణం

అభిమానుల మ‌ర‌ణంపై స్పందించిన ప‌వ‌న్ కళ్యాణ్